
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం. షేర్ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న యువతిపై అదే ట్యాక్సీలో ఉన్న మరో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్పూర్ ప్రాంతంలో దించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను కార్పూల్ బుక్ చేయబోతుండగా, మరో ముగ్గురు యువకులు తనను ఎక్కించుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై అన్వేషణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాహనాన్ని గుర్తించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.