తన కలను నెరవేర్చుకునేందుకు ఓ యువకుడు చనిపోయాడు. ఎస్ఎస్ సైనికుడు కావాలనే ఆశతో దేహదారుఢ్య పరీక్షకు శిక్షణ తీసుకుంటున్న ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్థపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ ఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.
త్వరలో జరగనున్న ఫిట్నెస్ పరీక్ష కోసం సూర్యాపేటలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో రోజూ స్నేహితులతో కలిసి రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడు. మంగళవారం ఉదయం పరిగెత్తుతుండగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ ఎస్ఎస్ కొడుకు శవంగా మారాడని తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
The post పరిగెడుతూ గుండెపోటు… నేలపై యువకుడు appeared first on T News Telugu