పెద్దపల్లి: తెలంగాణ గ్రామీణ పరిస్థితిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాకారమైన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టులు నిర్మించి పంటలకు నీరందిస్తున్నారన్నారు. ఉచితంగా కరెంటు అందజేస్తున్నామని, పండిన పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నామని వెల్లడించారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్‌ను అందించలేదని, తెలంగాణలో మాత్రమే అత్యధికంగా పింఛను అందజేస్తోందని వివరించారు.
నిరుపేదలకు పెళ్లి కానుకగా గర్భిణులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
850098