హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన కేసుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. దాడిలో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణలు బార్లో మద్యం సేవించి పవన్ ఇంటి వద్ద పార్క్ చేశారు. డ్రైవ్ చేయమని కోరిన పవన్ సెక్యూరిటీతో వారు వాగ్వాదానికి దిగారు.
పవన్ సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదం జరిగిన సమయంలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నారని విచారణలో తేలింది. పవన్ ఇంటి వద్ద పార్క్ చేసిన గుజరాత్ రిజిస్టర్డ్ కారు సేకృష్ణ అని పోలీసులు వెల్లడించారు.