పుతిన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఫ్లూ భయం పట్టుకుంది. అందుకే బంకర్ లోనే కాసేపు గడపనున్నాడని వార్తలొస్తున్నాయి. కారణం క్రెమ్లిన్‌లో చాలా మందికి ఫ్లూ ఉంది. పుతిన్ చాలా రోజుల పాటు బంకర్లో ఒంటరిగా ఉంటారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఏడాది పార్లమెంటు ఎగువ సభ అయిన డ్వామాలో ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. పుతిన్ ఇప్పటికే తన వార్షిక మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. నివేదిక ప్రకారం, క్రెమ్లిన్‌లో చాలా మందికి ఫ్లూ సోకిందనే వాస్తవాన్ని పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించలేదు. ప్రతి సంవత్సరం, పుతిన్ ముందుగా రికార్డ్ చేసిన వీడియో ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు.
పుతిన్ అస్వస్థతకు గురైనట్లు ఇటీవలి రోజుల్లో పలు పత్రికలు వార్తలు ప్రచురించాయి. ఆయనకు క్యాన్సర్ ఉందని కొన్ని వార్తా సంస్థలు రాశాయి. అయితే పుతిన్ ఆరోగ్య సమాచారాన్ని క్రెమ్లిన్ అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది.