కొచ్చి: స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన విమానం సాంకేతిక లోపానికి గురైంది. దీంతో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జెడ్డా నుండి కోజికోడ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ బి737-8 మ్యాక్స్ విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా 197 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయిందని పైలట్ ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే, విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు.
866621