అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో తన ప్రియుడు మైఖేల్ బ్లాస్ (25)ని వివాహం చేసుకుంది.
నాలుగు సంవత్సరాల డేటింగ్ తర్వాత ఈ జంట వివాహం చేసుకున్నారు. ట్రంప్ దగ్గర పెళ్లి జరిగింది. ఈ వేడుకకు ట్రంప్ ఫ్యామిలీ అంతా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
టిఫనీ డోనాల్డ్ ట్రంప్ మరియు అతని రెండవ భార్య, నటి మార్లా మాపుల్స్ యొక్క ఏకైక కుమార్తె. ట్రంప్ 1993లో మేరీని వివాహం చేసుకున్నారు. 1999లో వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మెలానియాను పెళ్లాడాడు.
The post ప్రియుడిని పెళ్లి చేసుకున్న ట్రంప్ కూతురు appeared first on Telugu News.