చెన్నై: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది. ఉజిలంబాటి సమీపంలోని ఓ ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది. అందులో పనిచేస్తున్న ఐదుగురు మృతి చెందారు. మృతులను అమ్మవాసి, వల్లరసు, గోపి, విక్కీ, ప్రేమగా గుర్తించారు. మరో పది మంది గాయపడ్డారు. వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు మదురై ఎస్పీ ధృవీకరించారు. ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీ వల్లేఅప్పన్ కు చెందినదని తేలింది.