ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా జట్టు సభ్యులు సందడి చేశారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి నేతృత్వంలో దేశ్‌కీ నేత కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందడిలో టీఆర్ఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పివి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా ఆస్ట్రేలియా వచ్చారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ కేసీఆర్ దేశ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భారతీయులందరూ కోరుకుంటున్నారని, ఆయన మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ఎన్నారైలతో పాటు దేశ ప్రజలు కూడా కేసీఆర్ తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.