
అమెరికాలోని హారిస్ కౌంటీ సివిల్ కోర్టులో న్యాయమూర్తిగా భారత సంతతి మహిళ మన్ ప్రీత్ మోనికా సింగ్ కు అరుదైన గౌరవం లభించింది. టెక్సాస్‌లోని హారిస్ కౌంటీ సివిల్ కోర్టులో ఆమె న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల మన్‌ప్రీత్ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె హ్యూస్టన్‌లో 20 ఏళ్లపాటు ట్రయల్ అటార్నీగా ప్రాక్టీస్ చేసింది. 1970లో మన్‌ప్రీత్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు. మన్‌ప్రీత్ హ్యూస్టన్‌లో పుట్టి పెరిగింది. మన్‌ప్రీత్‌కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.