తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక గుర్తింపుకార్డులు జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణేతర, గ్రామీణ స్వయం సహాయక సంఘాల సభ్యులను గుర్తించి కొత్త గ్రూపులను ఏర్పాటు చేయాలని సూచించారు.
తాజా సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల గ్రూపులు, సభ్యుల వివరాలను అప్డేట్ చేయాలని చెప్పారు. బ్యాంకులు అందించే వడ్డీలేని రుణాలను ఉత్పాదక రంగానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 6,06,000 స్వయం సహాయక సంఘాలలో 6.4 మిలియన్ల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు.