హైదరాబాద్ : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా కమిటీ అధ్యక్షురాలు వాకిటి సునీతాలక్ష్మారెడ్డి కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహిళా మండలి కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా స్థాయి సమావేశాలు తరచూ నిర్వహించి మహిళల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మహిళా కమిషన్లో నమోదైన కేసులను సమీక్షించారు. కమిటీ సిఫార్సులపై సంబంధిత ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించాలని, తీసుకున్న చర్యలను మహిళా కమిటీకి తెలియజేయాలన్నారు. కమిటీ పరిధిలో లేని ఆస్తుల వివాదాలు, కోర్టు కేసుల కోసం మహిళలు సంబంధిత శాఖలను సంప్రదించాలని చైర్ పర్సన్ వెల్లడించారు. అత్యాచార బాధితులకు బకాయి ఉన్న పరిహారం వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
బాధితులు సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. సమావేశంలో సభ్యులు షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతిరావు, కమిటీ కార్యదర్శి కృష్ణకుమారి పాల్గొన్నారు.
816549