కొత్త సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పడే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను ఎక్కువగా తొలగించారు. ఇందులో ఐటీ కంపెనీలు ముందంజలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా, అతిపెద్ద కంపెనీలు కూడా కార్మికులను తొలగిస్తున్నాయి. చాలా ఐటీ కంపెనీలు దాదాపు 65,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతం రోజుకు 3,000 మంది ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు. దీంతో పలువురు ఐటీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. అయితే యూఎస్‌లో ఐటీ, మీడియా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.