
హైదరాబాద్: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తండ్రి సోమయ్య (92) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. సోమయ్య మృతి పట్ల పార్టీల నేతలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. సోమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. బుధవారం ఉదయం 11 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
831286