మహారాష్ట్రలో ముంబైకి చెందిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు డ్రగ్ నిందితుడిని పట్టుకున్నారు. నైరోబీకి చెందిన ఓ ప్రయాణికుడిని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా వ్యవహరించినందుకు డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి లగేజీని తనిఖీ చేయగా అతని వద్ద 4.98 కిలోల హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.350 కోట్లు ఉంటుందని డీఆర్ ఐ అధికారులు అంచనా వేశారు.