
దోహా: అర్జెంటీనా ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరుకుంది. క్రొయేషియాతో జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. లుసిల్లే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మంచి ప్రదర్శన చేశాడు. ఆట ప్రారంభం నుంచే మెస్సీ తన అటాకింగ్ స్కిల్స్‌తో క్రొయేషియాను ముప్పుతిప్పలు పెట్టాడు. అర్జెంటీనాకు ఇది ఆరో ప్రపంచకప్ ఫైనల్స్.
మరో అర్జెంటీనా ఆటగాడు అల్వారెజ్ కూడా సూపర్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. ఆట 34వ నిమిషంలో క్రొయేషియా గోల్ కీపర్ లివాకోవిచ్ చేసిన ఫౌల్ కారణంగా పెనాల్టీ లభించింది. ఈ అవకాశాన్ని మెస్సీ సద్వినియోగం చేసుకున్నాడు. 39వ నిమిషంలో మెస్సీ అందించిన పాస్‌ను అల్వారెజ్ టర్న్ చేసి అద్భుతంగా గోల్ చేశాడు.
సెకండాఫ్‌లో విరామం తర్వాత, మెస్సీ మళ్లీ తన సత్తా చాటాడు. గోల్‌పోస్టులపై దాడి చేసింది. క్రొయేషియా డిఫెండర్‌ను దాటిన మెస్సీ బంతిని డ్రిబుల్ చేసి నేరుగా గోల్ వైపు నడిపించాడు. 69వ నిమిషంలో మెస్సీ అందించిన పాస్‌తో అల్వారెజ్ మరో గోల్ చేశాడు. దీంతో క్రొయేషియాపై అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో ఫైనల్లోకి ప్రవేశించింది.