అగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులను ఆపడం లేదు. తాజాగా, కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో స్ప్రింగ్ ఫెస్టివల్ సందర్భంగా కాల్పుల ఘటన కలకలం రేపింది. తాజా కాల్పుల ఘటనలో కనీసం 10 మంది మృతి చెందినట్లు సమాచారం.
పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి.
స్థానిక మాంటెరీ పార్క్‌లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా, ఎవరో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
The post అమెరికాలో చాంద్రమానం… కాల్పుల్లో 10 మంది మృతి appeared first on T News Telugu.