ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని ప్రయాగ్రాజ్ జిల్లాలో గురువారం ప్రమాదం జరిగింది. చిన్నారి వెంట్రుకలు తీయడానికి కుటుంబసభ్యులు విద్యా చార్ వద్దకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు తెరిచి దర్యాప్తు ప్రారంభించారు. మృతులను రేఖాదేవి (45), కృష్ణదేవి (70), సవిత (36), రేఖ (32), ఓజస్ (ఏడాదిన్నర)గా పోలీసులు గుర్తించారు.