మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ధమాకా’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు.
రవితేజ డ్యూయల్ క్యారెక్టర్ మూవీ రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందింది. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్లకు సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.