ఇప్పటికే తారకరత్న విషమ పరిస్థితి ఏంటని ఆందోళనలో ఉన్న టాలీవుడ్ కు రచ్చ రవిపై రూమర్స్ మరో విషాదంగా మారుతున్నాయి. రచ్చ రవి కారు ప్రమాదానికి గురైందని ఆన్లైన్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. కాని అది నిజం కాదు. తాను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు వస్తున్న వార్తలపై రాచ రవి వివరణ ఇచ్చారు. సూర్యాపేట, మునగాలలో రచ్చ రవికి యాక్సిడెంట్ అయ్యిందని.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని వార్తలు రాగా.. తాజాగా రచ్చ రవి వీటిని ఖండించారు.
అయితే తాను క్షేమంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి అడిగిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పూణేలో చిత్రీకరణ ముగించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చానని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగలేదని తెలిపారు. అంతేకాదు తాను విమానంలో హైదరాబాద్ వచ్చానని, కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. అంతేకాకుండా శనివారం వాల్తేరు వీరయ్య సక్సెస్ కాన్ఫరెన్స్‌కు కూడా హాజరవుతానని రచ్చ రవి వెల్లడించారు.