యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై చోటూ పాలమండల గుండ్లబావి సమీపంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. ఈ (గురువారం) ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సును గుండ్లబావి సమీపంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల్లో ఉన్న 11 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.