బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఇవాళ(బుధవారం) ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ ను జితేందర్ రెడ్డి అనే వ్యక్తి బిల్డింగ్ పర్మిషన్ కోసం కలిశాడు.
అయితే అందుకు రూ.75 వేల లంచం అడిగాడు జగన్మోహన్. అంత ఇచ్చుకోలేనని జితేందర్ చెప్పడంతో రూ.50 వేలు డిమాండ్ చేశాడు జగన్మోహన్. దీంతో నేరుగా జితేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం జితేందర్ రెడ్డి దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇది కూడా చదవండి: రేవంత్ నువ్వు మొగోనివి అయితే ఈ పనులు చేసి చూపెట్టు
The post లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డిప్యూటీ డైరెక్టర్ appeared first on tnewstelugu.com.