జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు సంభవించింది. జమ్మూ సమీపంలోని సిద్రా వంతెనపై మంగళవారం రాత్రి అనుమానాస్పద పేలుడు సంభవించింది. ఈ ప్రభావంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వంతెన చెక్‌పోస్టు వద్ద పేలుడు సంభవించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ట్యాంకర్‌ను ఢీకొన్న మెయిల్ లారీ. తప్పిన ముప్పు appeared first on T News Telugu