చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి తర్వాత, జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
భారీ మంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే, కొన్ని గంటల తర్వాత నాన్‌చాంగ్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రావిన్స్‌లో భారీ పొగమంచు ఉంది, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సిఫార్సు చేయబడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించవద్దని, దూరం పాటించాలని సూచించారు.