
విక్రమ్ గోఖలే ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే తీవ్ర అనారోగ్యంతో బుధవారం రాత్రి మరణించినట్లు సోషల్ మీడియాలో కథనాలు కొనసాగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ నటులు అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫర్ తదితరులు కూడా తమ సంతాపాన్ని ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఈ వార్తలపై గోఖలే కుటుంబం స్పందించింది. గోఖలే ఇంకా బతికే ఉన్నారని ఆయన కుమార్తె చెప్పారు. కాకపోతే ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
గోఖలే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం పూణేలోని దీనాత్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడిలో ఎలాంటి లోపం లేదని కుటుంబీకులు కానీ, ఆస్పత్రి అధికారులు కానీ వెల్లడించలేదు.
852874