మెదక్ : విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచి సమాజానికి ఉపయోగపడే విధంగా సైన్స్ ప్రయోగాలు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని వెస్లియన్ హైస్కూల్లో గురువారం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు.
ప్రయోగాలతో విద్యార్థుల ఆలోచనా నైపుణ్యాలు పెరుగుతాయని ఆమె చెప్పారు. ప్రతి విద్యార్థి సివి రామన్, కలాం, అమర్త్యసేన్లను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. రోజురోజుకు సాంకేతికత మారుతున్నదని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.
రాష్ట్రంలో విద్య, క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాంతీయ విద్యాశాఖాధికారి రమేష్ కుమార్, నగర చైర్మన్ చంద్రపాల్, రీజనల్ సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండల విద్యాధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
853311