
- పౌర హక్కుల కార్యకర్త హరగోపాల్
సుబేదారి, నవంబర్ 4: నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద భావజాలాన్ని వ్యాప్తి చేసి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని పౌరహక్కుల ఉద్యమనేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. హనుమకొండ సుబేదారి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆడిటోరియంలో పీడీఎస్ యూ రాష్ట్ర 3వ సదస్సు జరిగింది.
శుక్రవారం జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, ప్రశ్నించిన మేధావులను జైళ్లలో పెట్టుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం సంస్కృతి, వ్యాపార, మీడియా గోప్యత ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్నారు.
826283