హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రముఖ నటులు విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్, తనికెళ్ల భరణి, నాజర్, సాయికుమార్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్, చిరంజీవి, బ్రహ్మానందం, రాధిక, అటీవ్, రాజా రవీంద్ర, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, గుణశేఖర్, రాజమలియు, సత్యానంద్, కళాతపస్వి భౌతికకాయానికి దర్శకుడు మణిశర్మ, కీరవాణి, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, నిర్మాతలు అశ్వనీదత్, సి.కళ్యాణ్, అల్లు అరవింద్, సినీ గీత రచయిత చంద్రబోస్ తదితరులు నివాళులర్పించారు.
The post విశ్వనాథ్ మృతదేహానికి నివాళులర్పించిన సినీ ప్రముఖుడు appeared first on T News Telugu.