శ్రీశైలం: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి భ్రమరమల్లిఖార్జున స్వామిఅమ్మవార్లు భృంగివాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పంచాహ్నిక దీక్షతో 7రోజుల బ్రహోత్సవాల్లో రెండోరోజు ఉదయం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో వేదపండితులు, అర్చకులు చండీశ్వరస్వామి, జప, పంచావరణార్చన, నిత్యవాహన, రుద్రహోమ, మండపారాధన కార్యక్రమాలను యాగశాలలో నిర్వహించారు. సాయంత్రం ప్రదోష కాలపూజలు, హోమాలు, జపానుష్టానాలు జరుగుతాయి.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాన్ని బృంగివాహనంపై ప్రత్యేక అలంకారాలతో కొలువుదీరి ప్రత్యేక పూజలు, పుష్పయాగం నిర్వహించారు. గ్రామోత్సవాల్లో భాగంగా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నంది మండపం నుంచి బయలు వీరభద్రస్వామి వరకు స్వామివారి భృంగివాహనాధీశులను భక్తులు ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులు, జానపదాలు, కోలాటాలు, హరిదాసులు ప్రదర్శించిన వివిధ రకాల విన్యాసాలతో ఊరేగింపు కొనసాగుతుంది. గ్రామోత్సవంలో ఎగ్జిక్యూటివ్ లవన్న, ఈఈ రామకృష్ణ పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు మల్లయ్య, హరిదాస్, ఫణీంద్రప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనిల్ కుమార్, సూపర్ వైజర్ అయ్యన్న, రవి, మధుసూదన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు సామూహిక విందు
ఈఓ లవన్న మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో భాగంగా నేటి భోగి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామన్నారు. పథకంలో, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సామూహిక ఆహారం అందుతుంది. ఉదయం 10 గంటలకు ఆలయ అక్కమహాదేవి అకాలమండపంలో నిర్వహించే కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు భక్తుల పిల్లలకు కూడా పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. వేద పండితుల ప్రకారం, పిల్లలు బాల్య దోషాల నుండి విముక్తి పొంది ఆయురారోగ్యాలు పొందుతారు.