సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జగదేవ్పూర్ మండలం మునిపాడు మల్లన్న ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఆలయ కోనేరు వద్ద కారు అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. The post ఐదుగురు మృతి appeared first on T News Telugu