సూర్యగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేస్తామని శ్రీశైలం దేవస్థానం తెలిపింది. గ్రహణం అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలను తెరుస్తారు. ఆలయాన్ని శుద్ధి చేసి, మంగళవాయిద్యాలు, సప్రోక్షణ, ప్రదోషకాల పూజ అనంతరం రాత్రి 8 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని దేవస్థానం తెలిపింది. సూర్యగ్రహణం కారణంగా అన్ని ఆర్జితసేవలు, శాశ్వత సేవలు, పరోక్ష సేవలు నిలిచిపోవడంతో పాటు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలిచిపోయింది.అయితే రాత్రి 8 గంటల నుంచి భక్తులకు అల్పాహారం అందజేస్తామని శ్రీశైలం దేవస్థానం తెలిపింది
సూర్యగ్రహణం కారణంగా సర్వదర్శనం రాత్రి 8 గంటల తర్వాత మాత్రమే ప్రచురిస్తుంది. శ్రీశైలం దేవస్థానం appeared first on T News Telugu