
సిమ్లా: ఉత్తర భారతాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత వారం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని మండిలో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైనట్లు వెల్లడించారు. మండికి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. భూకంపం వల్ల సంభవించిన నష్టంపై ఇంకా సమాచారం లేదని అధికారులు తెలిపారు.
గత 15 రోజుల్లో హిమాలయాల్లో 11 సార్లు భూకంపాలు సంభవించాయి. నవంబర్ 8 నుంచి ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భూకంపాలు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 14న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో, అంతకుముందు ఢిల్లీలో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే.
842717