
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో సీబీఐ సోదాలు కలకలం రేపాయి. పాత బస్తీలోని అజంపురా సహా ఆరు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఒవైసీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అంజుమ్ సుల్తానా ఇంట్లో అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త నిర్వహిస్తున్న వ్యాపారాలపై కూడా దాడులు కొనసాగాయి. అంజుమ్ భర్త గతంలో కార్ షోరూమ్ నిర్వహించేవాడు. అప్పు చెల్లించకపోవడంతో అప్పట్లో బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు సోదాలు ప్రారంభించారు.