జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. కాటారం మండలం నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వన్యప్రాణులను వేటాడానికి దుండగులు ఇనుప కంచెకు కరెంటు పెట్టారు. అయితే కరెంటు తీగలు తగిలి కానిస్టేబుల్ ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుడు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరెంటు తీగలు పట్టిన వారిని పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి:ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
The post అడవిలో కరెంట్ షాక్..గ్రేహౌండ్స్ కమాండో మృతి appeared first on tnewstelugu.com.
