భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కుటుంబంలో విషాదం జరిగింది. ఇవాళ(శుక్రవారం) ఆయన అత్త గారు పుష్పా మెహ్రోత్రా కన్నుమూశారు. ఈ వార్త తెలిసే సమయానికి గవాస్కర్ టీమిండియా-ఇంగ్లండ్ టెస్టుకు కామెంటరీ చెబుతున్నారు. విశాఖలోని ఏసీఏ స్టేడియం కామెంటరీ బాక్సులో ఉన్న గవాస్కర్ అత్త గారు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే, కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయారు. తన భార్య మార్షనీల్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాన్పూర్ వెళ్లారు.
ఇది కూడా చదవండి: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
The post అత్తగారి మరణంతో కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయిన గవాస్కర్ appeared first on tnewstelugu.com.
