అదానీ-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై దర్యాప్తు చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరో ఆరు నెలల సమయం కోరింది. అయితే ఆరు నెలల గడువు ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అదానీ-హిండెల్‌బర్గ్ వివాదంపై న్యాయమూర్తి సప్రే నేతృత్వంలోని కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించింది.
విచారణను పూర్తి చేసేందుకు సెబీ ఆరు నెలల గడువు కోరడం సరికాదని పేర్కొంటూ తదుపరి విచారణలను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీని ప్రకారం జస్టిస్ సప్రే నేతృత్వంలోని కమిటీ నివేదికను పరిశీలిస్తామని… ఆపై సెబీ విజ్ఞప్తి ఆధారంగా ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై ఆలస్యంగా విచారణ…సుప్రీంకోర్టులో సెబీ రద్దు…! appeared first on T News Telugu
