రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. ఓటమి ద్వారా వచ్చిన అనుభవాలను విజయం సాధించే దిశగా ప్రయాణం సాగించాలన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కార్యకర్తల నుంచి వచ్చిన సూచనలను పార్టీ పరిశీలిస్తుందన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420.. 420 అంటే మోసం చేయడం. 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి గెలిచింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పారు.. డిసెంబర్ 9న 2లక్షల రుణమాఫీ పై సంతకం చేస్తా అన్నారు.. కొత్తగా రుణాలు తీసుకోవాలి అన్నారు. రైతు భరోసా కింద 3 హామీలు ఇచ్చారు.. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు అయిందా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు.. ప్రకటించిన తేదీలను ప్రజల తరఫున ఆడుతున్నాం..అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తయినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందా ? అని అడిగారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది.. ఎన్నికల కోడ్ వచ్చింది అని హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం.
తెలంగాణ హక్కులను కాపాడాలని 13న కేసిఆర్ కృష్ణా నది పై ఉన్న ప్రాజెక్టులను కాపాడాలని ప్రజల పక్షాన పోరాడేందుకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు కడియం. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు.. కృష్ణా నది సమస్య వచ్చింది.. ఆ పార్టీలు తెలంగాణ పక్షాన నిలబడవు.. తెలంగాణ గురించి పోరాడే చిత్తశుద్ధి బీఆర్ఎస్ కే ఉందన్నారు. మన గొంతును పార్లమెంటులో వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ సభ్యులను గెలిపించుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందన్నారు కడియం. రేవంత్ రెడ్డి భాష అతని వ్యక్తిత్వాన్ని చెబుతుంది.. ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలన్నారు. రైతు బంధు రాలేదు అంటే చెప్పుతో కొట్టాలి అని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి అంటున్నారు .. అధికారంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు కడియం శ్రీహరి.
ఇది కూడా చదవండి: నల్లగొండలో బీఆర్‌ఎస్ సభకు అనుమతినిచ్చిన ఎస్పీ
