అధికారం ఉంది కదాని స్థాయి మరిచి మాట్లాడుతే…తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అచ్చం ఇలాగే దిగజారి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఇస్తున్న కిక్కో లేదా ఇంకోదో తెలియదు కానీ…నోటికి ఏది వస్తే అదిమాట్లేస్తున్నారు. సీఎం పీఠమెక్కిన తిప్పికొడితే రెండు నెలలు కూడా కాలేదు..అప్పుడే తన నిజస్వరూపం బయటపడింది. తన రాజకీయ ప్రత్యర్థులను హింసాత్మకంగా హెచ్చరిస్తున్నారు. గొంతు పిసుకుతాం..గొయ్యి తవ్వుతాం, బొంద పెడుతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
అత్యున్నత అధికార పదవిలో కొనసాగుతున్న ఒక వ్యక్తి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లడటం విస్మయానికి గొల్పుతున్నాయంటూ పరిశీలకులు అంటున్నారు. లోకసభ ఎన్నికలకు ముందు మరోసారి తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నరన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ..వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలను ముఖ్యంగా బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి విమర్శలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మైనర్ కూతురుపై పదే పదే అత్యాచారం..కీచక తండ్రికి 150 జైలు శిక్ష..!!
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల మీటింగులో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీఆర్ఎస్ పట్ల ఆయన అసహనం ఎలా ఉందో స్పష్టంగా అర్థమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పులిని పట్టుకునేందుకు మా కార్యకర్తలు బోన్ లతో రెడీగా ఉన్నారంటూ తాను మేస్త్రీని అని వంద అడుగుల గొయ్యి తీసి బీఆర్ఎస్ ను బొందపెడతాం అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలపై బీఆర్ఎస్ నిలదీస్తుందన్న అక్కసుతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
