నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమేవేశం తరువాత ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియాతో ముచ్చటించారు.’ నగరంలో అన్ని సీట్లు గెలిచినాము అంటే దానికి ప్రధాన కారణం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణని ఎంతో అభివ్రుది చేశాం. ప్రగతి భవన్, సెక్రటరియేట్ ఎవరి కోసం కట్టినాము. ఎవరి అధికారంలో వస్తే వాళ్ళు కూర్చుంటారు, మా కోసం కట్టుకున్నమా, మా మీద ఆరోపణలు చేసావు.
డబ్బులు లేకపోయినా రాష్ట్రాన్ని నడిపిండు కేసీఆర్ గారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ కరెంట్ నీళ్లు ఇచ్చారా. కానీ కేసీఆర్ గారు కరెంట్ నీళ్లు నిరంతరాయంగా ఇచ్చారు. మా మేడ్చల్ లో రోడ్డు లేని గ్రామం లేదు. ముందు కాంగ్రెస్ పరిపాలన చేయాలి, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి. దళిత బంధు, బిసి బంధు, రైతు బంధు, అన్ని బంధు పెట్టిండ్రు, ఆఖరికి ఆరు గ్యారింటిలను కూడా బంధు పెట్టినట్టున్నారు. భారీ మెజారిటీతో మల్కాజగిరి గెలవబోతున్నాము.
