అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ యూఏఈకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బోచాసనవాసీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ ఆలయాన్ని ప్రధాని ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చిన…నమస్కరించుకున్నారు. ఆలయ ప్రారంభానికి వచ్చిన మోదీని చూసేందుకు భారత పౌరులు పెద్దెత్తున తరలివచ్చారు. వారికి అభివాదం తెలియజేశారు మోదీ. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్షయ్ కుమార్ సాంప్రదాయదుస్తుల్లో సందడి చేశారు.
అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో BAPS నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఇది. ఈ హిందూ దేవాలయం చాలా గొప్పది. చాలా పెద్దది. అయోధ్యలో రామ్ లల్లాకు ప్రతిష్ఠాపన తర్వాత దేశం వెలుపల పెద్ద హిందూ దేవాలయాన్ని ప్రారంభించడం కూడా ప్రధాని మోదీకి చారిత్రాత్మక క్షణం.ఇందుకోసం ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం అబుదాబి చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లు కౌగిలించుకున్నారు. అబు మురిఖా ప్రాంతంలో ఉన్న ఈ హిందూ దేవాలయం 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబడింది.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/2J5kQ1NjMu
— ANI (@ANI) February 14, 2024
ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీకి పూల మాలలు వేసి స్వాగతం పలికారు.ప్రతి ఒక్కరి కోసం ఈ ఆలయాన్ని నిర్మించామని బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయానికి చెందిన సెయింట్ స్వామి బ్రహ్మవిహారిదాస్ అన్నారు. ఈ దేవాలయం భగవంతుని దయ, అబుదాబి పాలకుడి దాతృత్వం,ప్రధాన మంత్రి గుర్తింపు, గొప్ప సాధువుల ఆశీర్వాదం, అందరి సహకారంతో నిర్మించారు.
#WATCH | Prime Minister Narendra Modi performs Aarti at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi. pic.twitter.com/PP5OwWFRxH
— ANI (@ANI) February 14, 2024
ఇది కూడా చదవండి: సరిహద్దులో BSF పోస్ట్పై పాకిస్తాన్ రేంజర్ల దాడి..తిప్పికొట్టిన భద్రతాబలగాలు..!!
The post అబుధాబీలో హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..!! appeared first on tnewstelugu.com.
