సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దిగువ సంగెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు గురువారం ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల చైర్మన్ సీతయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల సర్పంచ్‌ల ఫోరం చైర్మన్ నల్లు రామచంద్రారెడ్డి, సర్పంచ్ ఏషామాల సుశీల, ఎంపీటీసీ ఎలిజర్, నాయకులు జటంగి రవి, మల్యాల రాములు, మల్లయ్య, వెంకన్న, సుధాకర్, మహేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
