అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి పేరు మారింది. ఇకపై రామలల్లాను ‘బాలక్ రామ్’గా పిలువనున్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే.
Also Read.. తమ్ముడి వరస వ్యక్తితో అక్క ఆత్మహత్య.. అనుమానంలో కుటుంబసభ్యులు!
అయితే, ఐదేళ్ల బాలుడిగా బాలరాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బాలక్ రామ్’గా పిలవాలని పూజారులు నిర్ణయించారు. కాగా, గతంలో తాత్కాలిక మందిరంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని సైతం కొత్త ఆలయంలో ప్రతిష్ఠించారు. సరిగ్గా ‘బాలక్ రామ్’ మూలవిరాట్టుకు ముందు రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
