అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి హోటళ్లలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూమ్ రేట్లు ఏకంగా 500 శాతం పెరిగాయి. అంతేకాకుండా, ప్రతి 10 గదులకు 8 గదులు నిండిపోయాయని హోటల్ యాజమాన్యాలు వెల్లడించాయి. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది వరకు నగరానికి వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.
Read Also: ఆ చైన్ స్నాచర్స్ లవర్స్ కాదు… భార్యాభర్తలు
దాంతో నగరంలోని చిన్న, పెద్ద హోటళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అక్కడికి వెళ్లేవారు తమ తాహతుకు తగ్గట్లు హోటల్ గదులు బుక్ చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. గదుల రెంట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్లో రూమ్ ధర రూ. 70,240గా ఉందని ఆ హోటల్ ప్రతినిధి తెలిపారు. రామాయణ హోటల్లో కాస్త తక్కువగా రోజుకు రూ. 40 వేలు ఉన్నట్లు సమాచారం. ఇక సిటీలోని ప్రముఖ హోటల్ అయిన ‘పార్క్ ఇన్ రాడిషన్’లో గది అద్దె రూ.లక్ష వరకు చేరినట్టు హోటల్ యాజమాన్యం వెల్లడించింది.
