సిద్దిపేట కు చెందిన అమరనాథ్ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో అయోధ్యలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈనెల 17వ తేదీ నుండి లక్షలాది మందికి అన్నదానం చేస్తున్నారు నిర్వాహకులు. దాదాపు 40 రోజులపాటు.. ఫిబ్రవరి నెలలో కూడా అన్నదాం చేయనున్నట్లు తెలిపారు. సాధువులు,ఇతర రామ సేవకులకు,సామాన్య భక్తులకు 3 పూటలా భోజనం అందిస్తున్నామన్నారు. అయోధ్యలో ఇలాంటి సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని..మాకు సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.
ఈనెల 13న సిద్దిపేట నుండి అయోధ్యకు అన్నదానికి కావాల్సిన బియ్యం ఇతర వస్తువుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: అయోధ్య వేడుకలకు అద్వానీ దూరం
