యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్యా రాముడి ప్రాణప్రతిష్టకు ఘడియ దగ్గరపడింది. నేడు మధ్యాహ్నం 12.20గంటలకు మొదలై మధ్యాహ్నం 1గంటలకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగుస్తుంది. రామమందిరలో బాలరాముడి రూపంలో శ్రీరామచంద్రుడు కొలువుదీరనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా 7వేల మందికి పైగా ప్రముఖులు, అతిథుల మధ్య జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షలాది మంది టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో వీక్షించనున్నారు. ఈశుభ ముహుర్తాన దేశ విదేవాల్లో హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వాషింగ్టన్ నుంచి ప్యారిస్, సిడ్నీ దాకా దాదాపు 60దేశాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ వేడుక కోసం శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్టు అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు చేసింది. రామమందిరం మొత్తం పూలతో విద్యుద్ధీపాలతో అలంకరించారు. అయోధ్య వీధులను సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలోని 14జంటలు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకుంటాయి. ఇప్పటికే ఈనెల 16నుంచి ప్రారంభమైన వేడుకలు మంగళవారం వరకు కొనసాగనున్నాయి.
గర్భగుడిలోని రాముడి విగ్రహం బరువు దాదాపు 200 కిలోలు. విగ్రహం ఎత్తు 4.24 అడుగులు, వెడల్పు మూడు అడుగులు. విగ్రహం ఒకే రాతిపై చెక్కబడింది. దానికి మరే ఇతర రాయిని వాడలేదు. ఈ రాంలల్లా విగ్రహంతో పాటు, రాతితో ఒక ఫ్రేము వంటి ఆకృతిని తయారు చేశారు. దానిపై విష్ణువు యొక్క పది అవతారాలు ఉన్నాయి. ఇందులో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన్, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలు ఉన్నాయి. దీనితో పాటు, విగ్రహానికి ఒక వైపున గరుణ్, మరొక వైపు హనుమాన్ కనిపిస్తారు.
ఇది కూడా చదవండి: అన్ని బందులు ఆపేసిన కాంగ్రెస్ ని బొంద పెట్టాలి..!
