అయోధ్యలో రాముడికి గుడి కట్టాల్సిందేనని పోరాడిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అయితే రామ మందిరం కోసం పాటుపడిన ఈ ఇద్దరు నేతలూ ఇవాళ అయోధ్యలో జరుగుతున్న వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రాణప్రతిష్ట వేడుకలకు అద్వానీ హాజరు కావడంలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. మురళీ మనోహర్ జోషి కూడా హాజరవడం సందేహమేనని తెలిపాయి. ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలియాయి.
రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానీ, జోషిని విశ్వ హిందూ పరిషత్ గతేడాది డిసెంబర్ లోనే ఆహ్వానించింది. అయితే ఈ నెలాఖరులోగా బాల రాముడిని అద్వానీ దర్శించుకుంటారని విశ్వ హిందూ పరిషత్ నేత ఒకరు మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకున్న చిరంజీవి
