ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో వచ్చారు. ఎమ్మెల్యేలు హారీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు.
ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు. 6.5లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని..వారికి నెలకు రూ. 10వేలు ఇవ్వాలని మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 10లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఉచిత కరెంట్.. రేవంత్ రెడ్డి సర్కార్కు షాక్..!!
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ ఆటో కార్మికులను కూడా కాపాడుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీశ్ రావు అన్నారు. ఆటోలకు గిరాకీ లేక 6.5లక్షల ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేక బజారునా పడ్డారన్నారు. ఎంతమంది తిండిలేకు పస్థులంటున్నారన్నారు.
ఇది కూడా చదవండి: ఓటీటీ ఎంట్రీకి మెగాస్టార్ చిరంజీవి రెడీ?
అటు ప్లకార్డులతో సభలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది.
