అసోంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గౌహతిలోని జాలుబరి ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 10 మంది థర్డ్ ఇయర్ విద్యార్థులు నిన్న అర్ధరాత్రి అద్దె కారులో బయలుదేరారు. జలుక్‌బరి ప్రాంతానికి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
కారు మీడియన్‌ను దాటి ఎదురుగా వస్తున్న పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పికప్ ట్రక్కులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు.
గాయపడిన వారిని గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావించారు.
