
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో ఉద్యోగం ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరు ఏడు నకిలీ వర్క్ లెటర్లను స్వాధీనం చేసుకున్నారు.
మొరచిక్కం సంజీవయ్య (అలియాస్ జీవయ్య), ఫిరోజ్ సులేమాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్కులు, వెయిటర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు మహిళల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్నారు.
నకిలీ ఉద్యోగ ఆహ్వానాలు తయారు చేసి బాధిత మహిళలకు ఇస్తున్నారు. ఆ లేఖలు నకిలీవని తెలుసుకున్న బాధిత మహిళలు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
