హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. రంజీ ట్రోఫీ 2023-24సీజన్‌లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ జట్టు అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తన్మయ్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 160 బంతుల్లో 323 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా త్రిబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును తన్మయ్ అగర్వాల్ బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో బోర్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో.. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. కాగా.. తన్మయ్ మాత్రం కేవలం 147 బంతుల్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. ఇంకా చెప్పాలంటే అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 సిక్సర్లు ఉండటం గమనార్హం.
Read Also: యజమాని తిట్టాడని పెట్రోల్ పోసుకున్న వర్కర్
ఇకపోతే ఇదే మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును కూడా సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. తద్వారా 39 ఏళ్లుగా టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. రవిశాస్త్రి 1985లో బరోడా మీద 123 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. తన్మయ్ 119 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకుని ఈ ఘనత సాధించాడు. చివరి 50 పరుగులు కేవలం 12 బంతుల్లోనే సాధించి.. 300 మార్కును అందుకున్నాడు.
Magnificent! 🤯
Hyderabad’s Tanmay Agarwal has hit the fastest triple century in First-Class cricket, off 147 balls, against Arunachal Pradesh in the @IDFCFIRSTBank #RanjiTrophy match 👌
He’s unbeaten on 323*(160), with 33 fours & 21 sixes in his marathon knock so far 🙌 pic.twitter.com/KhfohK6Oc8
— BCCI Domestic (@BCCIdomestic) January 26, 2024
